ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ప్రపంచ బ్యాంక్ బృందం.. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించింది.
అమరావతిలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణలు అంతర్జాతీయంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని...