అత్యవసర ట్రాక్ మరమ్మత్తుల కారణంగా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 34/T(304/46-48) వద్ద రోడ్డు రవాణా ( 08-04-2026 to 14-04-2026 )మరో 7 రోజులు పొడిగించి మూసివేయబడతాయి
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. గాలికి మంటలు వేగంగా వ్యాపించి, ఎండిన చెత్తాచెదారం కారణంగా అగ్ని మరింత విస్తరించింది. కొండ పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన కళ్యాణ్, మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా, బసినికొండ ఆర్చి వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని బైకు ఢీకొట్టింది. స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్పై ఎంపీడీవో తాజ్ మస్రూర్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నంబర్ 758/4లో జరుగుతున్న ఈ లేఅవుట్ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు, తనిఖీలు చేపట్టారు. పంచాయతీ కేవలం చిన్న ఇళ్లకు మాత్రమే అనుమతిస్తుందని, లేఅవుట్లకు తప్పనిసరిగా 'హుడా' (PJM HUDA) అనుమతి ఉండాలని ఎంపీడీవో...
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ లైజన్ ఆఫీసర్ మరియు శ్రీరాంపూర్ ఏరియా బీసీ & ఓబీసీ ఏరియా కమిటీ నాయకత్వంలో సమావేశం నిర్వహించబడింది,జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడునని .శ్రీరాంపూర్ ఏరియా జి ఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అన్ని బొగ్గు గనులు మరియు...
మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా స్థాయి ప్రదర్శనలో సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలతో వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. పాఠశాల విద్యాశాఖ, ఉద్యం సంస్థ సంయుక్తంగా 9వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చాయని తెలిపారు. ప్రదర్శనలో ప్రతిభ చాటిన...
అన్నమయ్య జిల్లా నారిగణిపల్లి పంచాయతీ దిగువ లంబంవారి పల్లి గ్రామంలో పాత పగల కారణంగా ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా దుండగులు మళ్లీ అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.