పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు బుధవారం చౌడేపల్లిలో గంగ జాతర సందర్భంగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పండించే పంటలన్నీ సుభిక్షంగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ సీఓఓ, మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులిస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ, టాటా...
మంచిర్యాల నియోజకవర్గం : శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ,ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సీఐటీయు సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ,రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్ళు అనే అంశంపై జరిగే సెమినార్ ను జయప్రదం చేయగలరని ,సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ తెలిపారు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున జరిగింది, ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, లింగ బేధం లాంటి సామాజిక...
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వెలుగు సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. డ్వాక్రా, స్త్రీనిధి రుణాలు సకాలంలో రికవరీ చేయాలని కోరారు. మహిళలను అభివృద్ధి చేసేందుకు పని చేయాలన్నారు.
#RAJESH
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం అలజంగిలో బుధవారం సోలార్ పంపు సెట్ పని విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు సులభంగా సోలార్ పంపులతో నీరు తోడుకోవచ్చునని చెప్పారు. ఖరీఫ్ వరి పంట తీసిన వెంటనే హైబ్రిడ్ నువ్వులు సాగు చేయాలని రైతులను కోరారు. వేసవి నువ్వు సాగు విధానంపై అవగాహన కల్పించారు.
#RAJESH
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన చిన్నపాటి దుకాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించే చర్యలు చేపట్టారు.
అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తుతో రంగంలోకి దిగి, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఫుట్‌పాత్‌లపై ఉన్న...
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రి వచ్చారు.. ఐదు రోజుల క్రితం ఆమెకు డెలివరీ చేయగా బాబుకు జన్మించింది... బుధవారం పసికందు మృతి చెందగా,వైద్యుల నిర్లక్ష్యం కారణoగా బాబు మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట అనుష కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు
కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు. మార్చిలో 120 కేసులు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చీసుకున్నామన్నారు. ఈ ఏడాది మొత్తం 245 కేసులు 357 వాహనాలు పట్టుబడ్డాయి అని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన 'జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్'ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక స్టేషన్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్లిష్టమైన ఆస్తిపాస్తి నేరాలు, చోరీ కేసులను వేగంగా ఛేదించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బాధితులకు త్వరగా న్యాయం అందించాలని, నేరస్తులను పట్టుకుని ప్రజల సొత్తును రక్షించాలని...
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ, ఆనంద్ తమ మూడు సెంట్ల భూమిని నకిలీ రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో బాధితురాలు పద్మ మాట్లాడుతూ, మగారాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో...