*కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనం నిర్మాణ పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో,సీపీ గారు అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు...
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ముగ్గురిని సెకండ్ అదనపు మేజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండవసారి పట్టుబడినందున అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతనిని కరీంనగర్ జిల్లా జైలుకు...
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, మార్కుల మూల్యాంకనంలో డబుల్ చెక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఒక మార్కు తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ అదనపు జాగ్రత్తల వల్ల ఫలితాలు ఏప్రిల్ మూడో వారానికి...
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు షేక్ జాబీర్ ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ డిమాండ్ చేశారు ఫ్యాక్టో ఆధ్వర్యంలో రేపు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సన్నాక సమావేశంలో వారు మాట్లాడుతూ 12వ పిఆర్సిని వెంటనే నియమించాలని 29 మద్యంతర మృతి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు...
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై మంగళవారం రాళ్లు, కర్రలతో దాడి చేసి కాలు విరగ్గొట్టారు. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమిని రామకృష్ణ, రామయ్య, రెడ్డప్ప తదితరులు ఆక్రమిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. గతంలో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినా, ఆమెకు అండగా ఎవరూ లేరనే ధీమాతో నిందితులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయాలని...
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష రాయచోటికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. చంద్రశేఖర్‌కు మదనపల్లె తాలూకా, రామసముద్రం, వాయల్పాడు మండలాల్లో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, పట్టణ శాంతిభద్రతలపై దృష్టి సారించనున్నారు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ నీళ్ల ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రిలోని డ్రమ్ములను నింపినట్లు ఆర్‌ఎంఓ రాధిక తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి అవసరాల కోసం రోజుకు సుమారు ఐదు ట్యాంకర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని ప్రసూతి, చిన్న పిల్లల, అత్యవసర వార్డులతో పాటు ఐసియు విభాగాలకు...
సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయగూడాలోని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “అనీమియా ముక్త్...
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఆయన రైతన్నలకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీ సర్వే ప్రక్రియ అనేక తప్పులతో గందరగోళంగా మారిందన్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ క్రమంలోనే రైతులకు ఎలాంటి అపోహలు,...