Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
    వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం...
    349 Views
  • మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
    మంచిర్యాల: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి చెందిన బండారు విజయలక్ష్మి బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గొలుసును దొంగిలించారు. హైటెక్ సిటీ కాలనీ వద్ద ఆటో దిగి చూసుకునేసరికి గొలుసు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు.
    385 Views
  • హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|
    హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని సుమారు 7 ఎకరాల భూమిలో “బతకమ్మ కుంట” పేరుతో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, నెల రోజుల్లోగా సంబంధిత బోర్డులను పూర్తిగా తొలగించి, ఆ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది....
    385 Views
  • రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా నేడు బాపట్ల మండలం జమ్మలపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పర్యటించారు.ఇంటింటికీ వెళ్ళి రైతులతో ముఖాముఖి చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ పథకాల...
    1.1K Views
  • Moinabad farm house drugs
    📰 మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు: SIT ఏర్పాటు హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసుపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు **ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)**ను ఏర్పాటు చేశారు. 👉 ఈ SIT‌కు చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ను చీఫ్‌గా నియమించారు. 👉 బృందంలో...
    299 Views
  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    రాయచోటి మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాయచోటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ కలిసి పాల్గొన్నారు మైనార్టీ సోదరులు ఆయనను గజమాలతో జాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రిగారు మైనార్టీనాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన కఠోర...
    371 Views
  • దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
    AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. అమరావతిలో CM చంద్రబాబు నాయుడు 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని...
    324 Views
  • YS Vijayamma: ఆస్తుల వివాదం.. ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ.
    కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) బెంచ్‌కు ఆమె కౌంటర్...
    353 Views
  • TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
    శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 65 వేల పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సవిత వెల్లడించారు....
    319 Views