Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు.
#Boiena Rajesh3.7K Views -
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక.
కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.1.5K Views -
-
-
-
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందని
గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావాలి అంటే వెనకాడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు
అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పునర్నిర్మాణం చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు761 Views -