Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • In April 5 states elections
    *_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_* : పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు._   _ఏప్రిల్‌ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్‌ నెలల్లో ముగియనుంది....
    268 Views
  • మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
    మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు నిందితులలో కఠిన శిక్ష పడేటట్లు చూడాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేసిన సుగావాసి ప్రసాద్ బాబు చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు 
    391 Views
  • కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
    చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళ షెడ్లోకి చొరబడ్డ దుండగులు బీరువాలో ఉంచిన రూ.23 వేల నగదును అపహరించడంతో పాటు అక్కడ ఉన్న ఒక కారును కూడా దొంగలించుకొని వెళ్లారు.అదేవిధంగా కార్లకు సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా అపహరణకు గురైనట్లు షెడ్ యాజమాని తెలిపారు. ఈ ఘటనలో  లక్ష రూపాయల వరకు...
    333 Views
  • బాలికపై హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య!
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
    296 Views
  • బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం బాలిక అంత్యక్రియలు పూర్తికాకముందే, ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్తతో నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి, "న్యాయం గెలిచింది", "పోలీసులు జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా...
    306 Views
  • డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
    మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడి కోసం గాలింపు జరుగుతున్న సమయంలోనే అతని మృతి వార్త వెలుగులోకి రావడం కలకలం రేపింది. పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    340 Views
  • మదనపల్లి చిన్నప్ప కాలనీలో చేనేత కార్మికుడు ఆత్మహత్య.
    మదనపల్లి చిన్నప్ప కాలనీలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు బయారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 16న భార్య నారాయణమ్మ, ముగ్గురు పిల్లలు శివరాత్రి పండుగకు తంబళ్లపల్లెకు వెళ్లారు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చిన నారాయణమ్మ, బయారెడ్డి ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
    321 Views
  • మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
    మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది. నీరుగట్టుపల్లిలో బాలిక హత్య ఘటనతో ఇప్పటికే పట్టణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో రామారావు కాలనీ చర్చివీధి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి వీరంగంపై పోలీసులకు సమాచారం అందగానే టూ టౌన్ ఏఎస్ఐ రమణ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
    289 Views
  • మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
    మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు మంత్రులు లోకేశ్, అనిత ధైర్యం చెప్పారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకుని...
    287 Views
  • రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.
    మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ మంగళవారం సాయంత్రం డిమాండ్ చేశారు. అగంతకుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని, నిందితుడి చేతిపై పచ్చబొట్టు కూడా ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజకీయాలకు అతీతంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని పునీత్ కోరారు.
    282 Views