రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.
మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ మంగళవారం సాయంత్రం డిమాండ్ చేశారు. అగంతకుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని, నిందితుడి చేతిపై పచ్చబొట్టు కూడా ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజకీయాలకు అతీతంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని పునీత్ కోరారు.
0 Comments 0 Shares 21 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com