మదనపల్లి చిన్నప్ప కాలనీలో చేనేత కార్మికుడు ఆత్మహత్య.
మదనపల్లి చిన్నప్ప కాలనీలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు బయారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 16న భార్య నారాయణమ్మ, ముగ్గురు పిల్లలు శివరాత్రి పండుగకు తంబళ్లపల్లెకు వెళ్లారు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చిన నారాయణమ్మ, బయారెడ్డి ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
0 Comments 0 Shares 21 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com