మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది. నీరుగట్టుపల్లిలో బాలిక హత్య ఘటనతో ఇప్పటికే పట్టణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో రామారావు కాలనీ చర్చివీధి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి వీరంగంపై పోలీసులకు సమాచారం అందగానే టూ టౌన్ ఏఎస్ఐ రమణ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
0 Comments 0 Shares 24 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com