Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నగరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీకి ఏకగ్రీవం.
    చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో, టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ పరిణామం మాజీ మంత్రి ఆర్కే రోజాకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. నగరి మున్సిపల్ చైర్మన్ పదవికి మొత్తం 13 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టీడీపీ నుంచి...
    90 Views
  • అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నిండిపోవాలి..తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు.
    విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ ఈ పండుగ అందరి సంకల్పానికి నూతన శక్తినివ్వాలని ఆకాంక్ష ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నట్లు వెల్లడి విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ, ప్రతి ఒక్కరి...
    86 Views
  • ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి.. తెలుగు ప్రజలకు పవన్, లోకేశ్ దసరా శుభాకాంక్షలు.
    విజయదశమి పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.   "ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి,...
    88 Views
  • కంపు కొడుతున్న పలాస-కాశీబుగ్గ.. కుప్పకూలిన పారిశుద్ధ్యం!
    ఎన్నికల హడావిడిలో అధికారులు.. చెత్త కుప్పల మధ్య ప్రజల అవస్థలు పలాస-కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత వీధుల వరకు ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. రోజుల తరబడి వ్యర్థాలను తరలించకపోవడంతో డస్ట్‌బిన్లు పొంగిపొర్లి, చెత్త రోడ్లపైకి చేరుతోంది. తీవ్రమైన దుర్వాసనతో పట్టణ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు....
    250 Views
  • హరిత తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దసరా శుభాకాంక్షలు. హరిత తెలంగాణ సాధనకు అడవులు, వన్యప్రాణులను కాపాడాలని పిలుపు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలంగాణ అటవీ శాఖ తరఫున జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ శుభాకాంక్షలు తెలిపారు. అసత్యంపై సత్యం, చెడుపై మంచితనం సాధించే విజయానికి విజయదశమి ప్రతీకగా...
    97 Views
  • తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ మార్పు...
    తెనాలి మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేన్జే కళాశాల నుంచి బిఎస్సార్ అండ్ ఎన్ వి ఆర్ కళాశాలకు మార్పు చేశారు జెన్జీ కళాశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించి ఇరుకుగా ఉన్నందున మార్పు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈనెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతాయని  మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. 
    78 Views
  • "పండగ వేళ జమ్మి చెట్టు సాక్షిగా పూజ చేసి, నన్ను గెలిపించిన నా కుటుంబం లాంటి ఐదో డివిజన్ ప్రజలతో ఈ తొలి దసరాను జరుపుకోవడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. మీ అందరి ఆశీస్సులే నా బలం. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు!
    84 Views
  • నగరంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు ఈరోజు వివిధ దుర్గామాత మండపాలను సందర్శించారు.

    మేయర్ గారు మొదట వినాయక్ నగర్‌లోని ప్రశాంతి హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి, అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కండేయ మందిరం వద్ద దుర్గామాత మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.తదనంతరం గాజులపేటలోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటైన దుర్గామాత మండపాన్ని కూడా సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సంబంధిత కమిటీలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ గారు పాల్గొని, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు సాఫీగా, భక్తిశ్రద్ధలతో జరగాలని, అందరూ కలిసి పనిచేయాలని మేయర్ గారు సూచించారు.
    భక్తులందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

    ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    81 Views
  • దుర్గమ్మ సన్నిధిలో సినీ తారల సందడి... నందివెలుగు.
    తెనాలి. సమీపంలోని నందివెలుగు కనకదుర్గమ్మ ఆలయంలో పలువురు సినీ నటులు సందడి చేశారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆ తరువాత నటులంతా ఆలయ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు . 
    78 Views
  • 26వ వార్డులో ఇప్పిలి శంకర్ ప్రచార జోరు: అభివృద్ధి ప్రణాళికతో ఇంటింటికీ
    పలాస-కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 26వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇప్పిలి శంకర్ ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. "పదవి హోదా కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఒక మార్గం" అన్నది తన నినాదమని ఆయన చెబుతున్నారు. ఉదయం నుంచే వార్డులోని వీధుల్లో తిరుగుతూ పెద్దలను పలకరించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎన్నికల...
    278 Views