నగరంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు ఈరోజు వివిధ దుర్గామాత మండపాలను సందర్శించారు.
మేయర్ గారు మొదట వినాయక్ నగర్లోని ప్రశాంతి హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి, అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కండేయ మందిరం వద్ద దుర్గామాత మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.తదనంతరం గాజులపేటలోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటైన దుర్గామాత మండపాన్ని కూడా సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంబంధిత కమిటీలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ గారు పాల్గొని, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు సాఫీగా, భక్తిశ్రద్ధలతో జరగాలని, అందరూ కలిసి పనిచేయాలని మేయర్ గారు సూచించారు.
భక్తులందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

82 Views