Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా రెడ్డమ్మను బరిలో నిలిపినట్లు తెలిపారు. ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే మదనపల్లె మండల అభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని తెలిపారు.
    42 Views
  • Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో జడ్పిటిసి అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున టీ. రాజన్న, ఆయన కుమారుడు విశ్వనాధ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తండ్రి కొడుకులు జడ్పిటిసి అభ్యర్థులుగా వైసీపీ తరఫున నామినేషన్లు వేయడంతో స్థానికంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
    43 Views
  • భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా పూర్తి
    భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా  ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించుకుంటే కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.  వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఐలూరి రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో...
    41 Views
  • నామినేషన్ల స్క్రూటినీ స్టార్ట్.. అభ్యర్థుల మధ్య ముళ్లకంచె
    APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. అనంతపురంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. TDP, YCP అభ్యర్థుల మధ్య ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. అటు తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు రేపు 5PM వరకు అవకాశం ఉంటుంది. 27న 3PM తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
    74 Views
  • గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
    48 Views
  • గరివిడిలో బిగ్ ఫైట్.. బొత్స వర్సెస్ కళా!
    గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. #RAJESH 
    65 Views
  • ఉదయం టీడీపీకి.. మధ్యాహ్నం జనసేనకు నామినేషన్
    బాడంగి మండలంలో ఎన్నికల విచిత్రం చోటు చేసుకుంది. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన మత్స శిరీష శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. మధ్యాహ్నం జనసేన అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. ఒకే అభ్యర్థి రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేయడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేసినట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు....
    61 Views
  • జిల్లాలో పెరుగుతున్న శిశు మరణాలు
    విజయనగరం జిల్లాలో శిశు మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 149 మంది శిశువులు, నలుగురు గర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో 307 శిశు మరణాలు, 10 మాతృ మరణాలు సంభవించాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. #RAJESH 
    68 Views
  • *తిరుమలగిరి - ఆల్వాల్ రోడ్డులో మృత్యు వేగం - తప్పిన పెను ప్రమాదం*
    *హైదరాబాద్, తిరుమలగిరి:* తిరుమలగిరి నుంచి ఆల్వాల్ వెళ్లే రద్దీ రోడ్డులో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కలకలం రేపింది. ఈ రోజు, తేదీ *24-10-2026* న, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో *TS07KG9748* నంబర్ గల నల్ల టాటా నెక్సాన్ కారు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అత్యంత రాష్ గా, ప్రమాదకరంగా వెళ్తూ కనిపించింది. రోడ్డు పక్కన టైర్ల షాపులు, ప్రజలు, బైక్ పై...
    90 Views
  • అభివృద్ధిపై అప్పలరాజు వ్యాఖ్యలకు టీడీపీ వర్గం కౌంటర్!
    రహదారులు, వైద్యం, విద్య, గృహ నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వ పనుల వివరాలు వెల్లడి పలాస: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పలు అంశాలతో కూడిన వివరణ వెలువడింది. రహదారులు, వైద్య సదుపాయాలు, విద్య, గృహ నిర్మాణం సహా పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో చేపట్టిన పనుల వివరాలను వెల్లడిస్తూ...
    67 Views