Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
Annamayya: అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి పూర్తి పోలీసు రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తెలిపారు. ఎవరైనా నామినేషన్లను అడ్డుకున్నా లేదా బెదిరింపులకు పాల్పడినా వెంటనే స్థానిక ఎస్ హెచ్ ఓ, సీఐ లేదా డీఎస్పీల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాంటి ఫిర్యాదులపై తక్షణమే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.38 Views
-
-
-
మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున జయ భవ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ జనసేన పార్టీ తనను గుర్తించి జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.40 Views
-
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో ఆయన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు40 Views
-
మదనపల్లె: సీటీఎం-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున 68 ఏళ్ల ఉత్తమ్మ నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను సహాయకులు పట్టుకుని నామినేషన్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళా రిజర్వేషన్ కారణంగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపినట్లు సమాచారం. మరోవైపు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న జనసేన పార్టీ 68 ఏళ్ల వృద్ధురాలిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.39 Views