మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా రెడ్డమ్మను బరిలో నిలిపినట్లు తెలిపారు. ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే మదనపల్లె మండల అభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని తెలిపారు.
22 Views