Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతు
    చీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో హ్యాండ్‌పంప్‌కు మరమ్మతులు చేపట్టారు. బీచ్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు, గ్రామస్తుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తుల కోరిక మేరకు హ్యాండ్‌పంప్‌ను రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా...
    331 Views
  • ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2026 రెండో రోజు సెషన్ ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు
    ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ‘బిజినెస్ ఎక్స్‌పో–2026’ రెండవ రోజు సెషన్‌ను ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ...
    319 Views
  • నాచారం పెద్ద చెరువు వద్ద అక్రమ ఆక్రమణకు యత్నం.. అడ్డుకున్న హైడ్రా అధికారులు

    నాచారం పెద్ద చెరువు వద్ద ఇంద్రానగర్ వాసులు ప్రభుత్వ భూమి మరియు చెరువు ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణలో భాగంగా అక్రమ ఆక్రమణలను నిరోధించినట్లు అధికారులు తెలిపారు.
    216 Views
  • 🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
    హైదరాబాద్‌లో  కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఆ  కారును కొందరు హిజ్రాలు అడ్డుకుని, చుట్టుముట్టారు. వాహనదారుడి నుండి ఏకంగా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వడానికి కారు యజమాని నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన హిజ్రాలు ఆయనను ఘోరంగా శపించడం ప్రారంభించారు.
    449 Views
  • రెండో రోజు గణపతి మండపాలకు సహకారం...
    శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని గణపతి మండపాలకు సహకారం అందించడం జరిగింది. ప్రతి మండపం నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ..భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి.  
    244 Views
  • హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.

    ✅ శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

    ✅ ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

    ✅ గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

    ✅ గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.

    ✅ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలిపారు.

    ✅ గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

    ✅ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.

    ✅ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

    ✅ నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    278 Views
  • గణేష్ మండపాల్లో అవగాహన.|
    అల్వాల్, సెప్టెంబర్ 12: రాబోయే వినాయక చతుర్థి వేడుకలను దృష్టిలో ఉంచుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో SHO A. ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణపై సమావేశం జరిగింది. పండుగ సందర్భంగా భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వివిధ గణేష్ మండపాల వద్ద డ్రగ్స్ నివారణ, మహిళల భద్రత, సైబర్ మోసాలు, కల్తీ ఆహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. ఈ...
    Like
    1
    236 Views
  • “ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రం... ఆమెను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.”
    చిన్ననాటి నుంచే తల్లి వాసవి గుత్తా కోరిక మేరకు నాగదుర్గ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. నృత్యమే తన ప్రపంచంగా భావించిన ఆమె... ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ‎వేదికపై శాస్త్రీయ నృత్యం చేస్తే హుందాతనం... ‎తెలంగాణ జానపద గీతానికి అడుగేస్తే పల్లె పరిమళం... ‎కెమెరా ముందుకొస్తే నటిగా మరో కొత్త రూపం... ‎ఇలా ఒకే కళాకారిణిలో ఎన్నో కోణాలను...
    388 Views
  • Madanapalle: జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ పొందిన కార్పొరేట్ల పేర్లు వెల్లడించాలని మదనపల్లెలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు.
    మదనపల్లె: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మాఫీ పొందిన కోటీశ్వరులు, కార్పొరేట్ సంస్థల పేర్లను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 12 ఏళ్లలో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసినట్లు పేర్కొన్న ఆయన,...
    157 Views