Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
     అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.  మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె...
    232 Views
  • ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన.. హెచ్ఎం సహా ముగ్గురిపై వేటు.
    పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) రుక్మాండయ్య వివరాలు వెల్లడించారు. పాఠశాల హెచ్ఎం దూడ శాంతమతి,...
    172 Views
  • Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/watch?v=g_Z_YnCVW-w     *X* https://x.com/TelanganaCMO/status/2099029956139651178     *Facebook* https://www.facebook.com/100064704154682/videos/1081526027594992
    285 Views
  • పిడుగు శబ్దానికే ఆగిన గుండెలు.. పల్నాడులో ఇద్దరు మహిళల మృతి.
      Andhra   పల్నాడు జిల్లాలో విషాద ఘటన నరసరావుపేట పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఘటనలు భారీ శబ్దానికి ఉలిక్కిపడి గుండెపోటుతో మరణించారని వెల్లడి పల్నాడు జిల్లాలో పిడుగుల ధాటికి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నరసరావుపేట మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఈ దుర్ఘటనలు జరిగాయి.   వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు,...
    157 Views
  • వినాయక చవితి వేళ... పురాణపండ 'గౌరీపుత్ర' సందడి.
    ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం వ్యవస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అనే గ్రంథం గణేశ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రధాన నగరాల్లో ఈ పుస్తకానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.   ఈ గ్రంథంలో శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు...
    169 Views
  • మంచిర్యాల: ఎమ్మెల్యే సహకారంతో స్వదేశానికి చేరిన యువతి
    ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చికాగోలో ప్రమాదానికి గురైన నస్పూర్ కు చెందిన స్పందన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్ లో కింద పడి గాయపడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్పందన స్వదేశానికి వచ్చే అందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు వీసా కోసం అధికారులతో మాట్లాడారు.. ఇంటికి చేరుకున్న స్పందన ఆదివారం నాడు ఎమ్మెల్యే ప్రేమ సాగరగా సాగర్...
    349 Views
  • ఉప్పల్ భగాయత్‌లో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన
    హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
    ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల విజయభాస్కర్ సహా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
    268 Views
  • ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లకుండా BRS ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

    ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్తున్న స్థానిక BRS ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.

    ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తన సహచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలను కూడా ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

    ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన అనుచరులు పోలీసులను ప్రశ్నించారు. కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
    235 Views
  • జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .
    జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీషియల్ (ITO) గా ఎంపికై జపాన్ వెళ్తున్న శ్రీ *D.V.S.Y. శర్మ* గారిని అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ విప్ *గణబాబు* గారు అభినందించారు. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ చాటిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడా రంగానికి మరియు దేశానికి సేవలందిస్తూ...
    337 Views
  • ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
    విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 29 ఏళ్లుగా సహకార రంగంలో విజయవంతంగా సేవలందిస్తున్న సొసైటీ యాజమాన్యాన్ని మరియు సభ్యులను ఆయన అభినందించారు. స్థానిక ప్రజలకు ఆర్థిక భద్రతను చేకూర్చడంలో,...
    325 Views