Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గిరివర్ధన్ రెడ్డికి మల్కాజిగిరి బీజేపీ పగ్గాలు.|
    ● మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకారం ● మోదీ నాయకత్వంతోనే దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ: ఈటల రాజేందర్ ● జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలి: రామచందర్ రావు అల్వాల్, ఆగస్టు 30: మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం, నూతన జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా...
    226 Views
  • నర్సు మృతి వెనుక మిస్టరీ.. తుక్కుగూడలో ఉద్రిక్తత.|
    ● సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన.. ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల యువతి మృతదేహం ● హత్య కోణంలో దర్యాప్తు.. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాల సేకరణ ● ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళన.. కొంతసేపు ఉద్రిక్తత అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో...
    218 Views
  • జీడిమెట్లలో గంజాయి కలకలం.. ఇద్దరి అరెస్ట్.|
      ● 11.365 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ ● విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టివేత ● ప్రధాన సరఫరాదారుడి కోసం పోలీసుల గాలింపు అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్లలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టైంది. కుత్బుల్లాపూర్‌ హెచ్‌ఎంటీ జంగిల్‌ ప్రాంతంలోని పాత ప్రభుత్వ కళాశాల సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 11.365 కిలోల...
    214 Views
  • కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని, చంద్రబాబు నాయుడుకు కట్టుబడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కార్యకర్తలు తనతో పాటు జైలుకు వెళ్లారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది బురద రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణాన్ని కలుషితం...
    330 Views
  • మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
    ● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు ● మాజీ ఉద్యోగి వివాదం నేపథ్యంలో ఘటన ● BNS 329(4), 79, 351(2) సెక్షన్ల కింద కేసు ఆల్వాల్, ఆగస్టు 30: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌లో మహిళా వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరింపులకు దిగారనే ఆరోపణలపై స్థానిక బీఆర్‌ఎస్ నేత జె.కె. సాయి గౌడ్, మాజీ ఉద్యోగి సునీల్‌పై పోలీసులు...
    302 Views
  • ప్రశాంతంగా నీట్ పరీక్షలు. అన్నమయ్య ఎస్పీ ధీరజ్
        జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ అన్నమయ్య జిల్లాలో *"నీట్ పీజీ పరీక్షలు"* ప్రశాంతంగా ముగిశాయి.   రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె, డీఎస్పీ బుచ్చిరాజు, పర్యవేక్షణలో జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాల (బిట్స్, శ్రీ సాయి, మిట్స్, ఆదిత్య) కేంద్రాలలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.  ...
    367 Views
  • శాంత ఎన్నికలు గ్రామ భద్రత లక్ష్యంగా. పోలీసుల పల్లెనిద్ర
    అన్నమయ్య జిల్లా-తేదీ:29.08.2026   *ప్రశాంత ఎన్నికలు, గ్రామ భద్రతే లక్ష్యంగా పోలీసుల 'పల్లె నిద్ర'*   జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శనివారం రాత్రి గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేపట్టారు.   అధికారులు స్థానిక ప్రజలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా...
    394 Views
  • [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్
    [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
    [31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు.
    [31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు.
    [31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్‌ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు.
    [31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.
    464 Views
  • అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
    బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్, VRO, VRAలు కలిసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయానికి  తరలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ఐ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు సహకరించాలన్నారు.
    222 Views