అన్నమయ్య జిల్లా:-మదనపల్లె
ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి,...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్లో ఆదివారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నుంచి భారీగా పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కొంతసేపు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని కఠినంగా, పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ (ITDA) ఏపీఓకు వినతిపత్రం సమర్పించారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన,...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కె. హరిత, డీసీసీబీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఆదివాసీ నాయకులతో కలిసి నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం...
● 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి
● రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ 78.14 శాతం
● 94.30 శాతంతో యాదాద్రి భువనగిరి అగ్రస్థానం.. హైదరాబాద్లో 58.58 శాతమే
హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision–SIR 2026) లో ఇంటింటి సర్వేకు నేటితో గడువు ముగియనుంది.
బూత్ స్థాయి అధికారులు (BLOs)...
● పదో తరగతి బాలుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు
● మెట్లపై నుంచి పడిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది
● తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అభిషేక్.. బాధ్యులపై చర్యలకు కుటుంబం డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 10: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడలో శ్రీచైతన్య పాఠశాల హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం...
శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా మారింది. యువకులపై రాడ్లు, కర్రలతో దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనలో పలువురు యువకులు గాయపడినట్లు సమాచారం,బాధితుల వర్గాల వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి యువకులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళలతో కళ్లలో కారం కొట్టించి, అనంతరం దాడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి,ఈ...
బొబ్బిలి పట్టణంలో వైసీపీ ర్యాలీ, ధర్నాకు ఎటువంటి అనుమతులు లేవని బొబ్బలి పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలిలో సెక్షన్-30 అమలులో ఉన్నందున అనుమతులు లేదన్నారు.అనుమతులు లేకుండా ర్యాలీ, ధర్నా చేయడం చట్టరీత్యా నేరమని, ర్యాలీ, ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#Rajesh
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. అమ్మగారి కోనేరు గట్టు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#Rajesh