Bharat Aawaz

Madanapalle: మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీల దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
150
Views

అన్నమయ్య జిల్లా:-మదనపల్లె

 

ఆదివాసీల దినోత్సవంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ

 

అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే సాజన్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం ఎంతో విశిష్టమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టమాట మార్కెట్ యార్డు డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప, యర్రబెల్లి వెంకటరమణారెడ్డి (సమర), 35వ వార్డు అధ్యక్షులు, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో చిన్నారులు సంప్రదాయ ఆదివాసీ వేషధారణలో సందడి చేయడంతో కార్యక్రమానికి ప్రత్యేక శోభ సంతరించుకుంది.