కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్
హైదరాబాద్ :
ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.
కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.