లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు

0
212

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి నెలకు రూ.26,000 వేతనం ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ఇరవై సంవత్సరాలుగా పేద ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి వారిని కార్మికులుగా ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆశా సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్భంగా మరియంపేట పీహెచ్సీ డాక్టర్ జి. శిరీషకు సమ్మె నోటీసు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. వసంతరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శీలమ్మ, వి. ఆశాజ్యోతి, ఎం. దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం
హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్...
By Ponnala Srinivasrao 2026-03-26 04:35:13 0 238
Telangana
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మాజీ మంత్రి,...
By Sadaq Sadaq 2026-06-09 09:47:05 0 146
Telangana
హైదరాబాద్ లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.|
హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-12-07 15:50:52 0 328
Telangana
Heavy Traffic Jams towards jntu - Hitech City Road
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city...
By Terli Ashok 2026-01-30 17:45:23 0 338
Telangana
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్‌ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ ఇమ్రాన్‌ అధ్వర్యంలో...
By Sadaq Sadaq 2026-03-06 17:29:50 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com