బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
472

 

 

మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం ఈరోజు బోయిన్ పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడని,మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని,350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని, జమిందారులు, భూస్వాములపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని,ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు.ఈ జయంతి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

      -sidhumaroju 

Search
Categories
Read More
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 232
Telangana
తెలంగాణలో బిర్లా మైనింగ్ బిడ్ గెలుపు |
బిర్లా కార్పొరేషన్ యొక్క సబ్సిడియరీ RCCPL ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని మైనింగ్ బ్లాక్ కోసం...
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:19:56 0 156
Telangana
సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్ అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని ...
By Sidhu Maroju 2025-07-30 16:04:16 1 694
Telangana
జీవో 9 విచారణతో స్థానిక ఎన్నికల భవితవ్యం |
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 08న హైకోర్టులో జీవో 9పై విచారణ జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:27:37 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com