Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.

0
195

నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు

కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని అందించిన జైలు అధికారులు

 

ప్రత్యేక పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి రాంబాబు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్లీప్ అప్నియా అనే ప్రత్యేక పరికరాన్ని జైలు అధికారులు సమకూర్చారు.  

 

అంబటి రాంబాబుకు స్లీప్ అప్నియా సమస్య ఉండటంతో ఆయన ప్రత్యేక పరికరం సాయంతో నిద్రిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్దరణ అవుతుంది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది. 

 

ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో ముందుగా అంచనా వేయడం కష్టం కావడంతో నిద్రకు ముందు నుంచే పరికరాన్ని అమర్చుకుని నిద్రిస్తారని వైద్యులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.  

Search
Categories
Read More
Andhra Pradesh
చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్
**చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్*   *త్రాగునీటి కొరత రాకుండా...
By Rajini Kumari 2026-06-01 12:27:27 0 188
Telangana
Amberpet flyover opening
హైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన...
By G k Nookala 2026-08-31 14:46:19 0 175
Andhra Pradesh
టిడిపి ఎస్సీ సెల్ నేతపై నలుగురు కార్యకర్తల సస్పెన్షన్
    తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న నేపథ్యంలో...
By Benguluri Madhubabu 2026-07-15 07:08:35 0 249
Andhra Pradesh
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2025-12-31 10:45:33 0 433
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com