TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.

0
179

నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం

రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే డాలర్లు అమ్మేలా కొత్త విధానం

ఒకరికొకటి మాత్రమే, పాన్ కార్డు నిబంధన అమలుకు ప్రణాళిక

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.

 

గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి (ప్రతి మంగళవారం) మాత్రమే సవరిస్తారు. కానీ, బులియన్ మార్కెట్‌లో ధరలు రోజూ మారుతుండటంతో టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

ఈ నష్టాలను నివారించి, విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించాలని భావిస్తోంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక డాలర్ చొప్పున అమ్మాలని యోచిస్తోంది. రూ.50 వేలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Law and Public Safety Measures
Tamil Nadu continues to enhance law and order through police modernization, technology-driven...
By Fathima Safa 2026-06-29 10:51:14 0 138
SURAKSHA
Bimal Gupta: Strengthening Himachal's Police Excellence
A distinguished IPS officer of the Himachal Pradesh Cadre, leading Armed Police & Training...
By Lokeshwari Panthadi 2026-07-24 09:54:13 0 234
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో...
By Pagadala Venkateswar 2026-01-15 07:59:33 0 214
Telangana
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
By Sidhu Maroju 2026-02-06 20:23:08 0 234
Andhra Pradesh
PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు...
By Boya Dasthagiri 2026-06-26 06:58:01 1 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com