ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు

0
102

ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు గారు . ఎస్ ఎస్ జి డిఎస్పి కె. శివ పోతురాజు గారు మరియు ఇతర శాఖల అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్‌ను పరిశీలించి, బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, ప్రజా వేదికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులకు ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం, ఏ ఆర్ డి ఎస్పి కె. శ్రీనివాసరావు,ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, చీమకుర్తి సీఐ డి ప్రసాద్, పామూరు సీఐ వినోద్ కుమార్, ఆర్ఐ రమణ రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Karnataka Police Today: Heroes Without Badge Heart
Today Karnataka police officers proved heroes need no badge. Orphan children got guardians who...
By Kalaga Sailaja 2026-07-04 07:25:25 0 108
Telangana
ప్రేమ పేరుతో మైనర్‌కు వల..?
"మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీసుల కేసు నమోదు" మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్...
By Sidhu Maroju 2026-06-27 05:37:33 0 98
Telangana
బొల్లారం ఆర్మీ ఆయుధాగారం చోరీ.. నలుగురు అనుమానితులపై విచారణ.|
● నాలుగు అనుమానితులపై కొనసాగుతున్న విచారణ ● మాజీ సిబ్బంది కోణంలోనూ ఆరా ● ఆయుధాల కేసుతో 160...
By Sidhu Maroju 2026-09-04 06:40:24 0 102
Telangana
ఘనంగా SRP-I ఇంక్లైన్ గని స్వర్ణోత్సవ వేడుకలు
మంచిర్యాల : సింగరేణి సంస్థ అభివృద్ధిలో శ్రీరాంపూర్-1 ఇంక్లైన్ గని తన విశిష్ట ప్రస్థానాన్ని...
By Avunoori Mahesh 2026-09-02 14:10:56 0 143
Andhra Pradesh
స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.
కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి...
By Pagadala Venkateswar 2026-05-28 07:14:50 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com