ACB Raids: ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.

0
265

Andhra

ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు

అక్రమాస్తుల కేసులో అటెండర్ తిరుమలేశ్‌పై చర్యలు

 

రూ.50 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులు గుర్తింపు

11 స్థిరాస్తులు, భారీగా బంగారం, వెండి స్వాధీనం

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-3 ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న నల్లిపోగు తిరుమలేశ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు.

 

అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్‌కు గురైన తిరుమలేశ్‌పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు నెల్లూరు జిల్లా డీసీ పల్లెలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తం ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి.

 

ఈ సోదాల్లో ఇప్పటివరకు 11 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 1.47 కిలోల‌ బంగారం, 8.77 కిలోల వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.15.26 లక్షల నగదు, ఇంట్లోని విలువైన ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా సీజ్ చేశారు. ఓ సాధారణ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 246
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 277
Andhra Pradesh
హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
Iran       *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన...
By Rajini Kumari 2026-04-13 08:04:00 0 150
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి...
By Avunoori Mahesh 2026-04-06 17:03:57 0 328
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:28 0 800
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com