తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|

0
218

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి)

తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన ఒక యువకుని ప్రాణాలను బలితీసుకుంది.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 

బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో నివాసముండే ఎస్. బాబుఅచ్చన్న (33) గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తడితో బాధపడుతున్నాడు. 2021 అక్టోబర్ లో తన తండ్రి మరణించినప్పటి నుండి అచ్చన్న తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 

 

తండ్రి జ్ఞాపకాలనుండి బయటపడలేక, మానసిక అనారోగ్యం తోడవడంతో తీవ్ర మనోవేదనకు లోనైనా అచ్చన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 

ఉదయం నిద్ర లేచిన తల్లి సోడదాసి విమలమ్మ, తన కుమారుడు విగత జీవిగా వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

 

సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు ఉదయం 6:10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడి మరణం పై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని, మానసిక బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో...
By Boiena Rajesh 2026-03-23 06:54:01 0 255
Andhra Pradesh
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడ   *వైసిపి అధినేత వైఎస్ జగన్ :*   25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు...
By Rajini Kumari 2025-12-16 10:15:44 0 253
Andhra Pradesh
మదనపల్లి: బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా శివపార్వతి దేవి.
మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా సీనియర్ అధ్యాపకురాలు శివపార్వతి దేవి...
By Pagadala Venkateswar 2026-03-03 03:02:21 0 197
SURAKSHA
Saswata Mishra IAS: Driving Odisha's Visionary Governance
A distinguished 1996-batch IAS officer of the Odisha Cadre, Saswata Mishra has emerged as one of...
By Lokeshwari Panthadi 2026-07-27 05:38:07 0 209
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com