ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|

0
232

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని అల్వాల్ పోలీసులు స్పష్టం చేశారు. 

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజిగూడలో రోడ్డు ప్రమాదాల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ, ప్రశాంత్, లాండ్ అండ్ ఆర్డర్ (L&O) విభాగం సిబ్బంది వాహనదారులకు స్థానిక ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పై విపులంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం మితిమీరిన వేగంతో వెళ్లకపోవడం వంటి అంశాలను గురించి వివరించారు. 

నిబంధనలను అతిక్రమిస్తే ఎదురయ్యే ప్రమాదాలను సోదాహరణంగా వివరిస్తూ వాహనదారులలో చైతన్యం నింపారు. "మీ భద్రతే మా ప్రాధాన్యత" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 

తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత కూడా తమపై ఉందని వాహనదారులతో  ఎస్ హెచ్ ఓ  ప్రతిజ్ఞ చేయించారు..

 

#sidhumaroju

Search
Categories
Read More
Uttarkhand
Kedarnath Yatra: VIP Darshan Controversy Sparks Inquiry
As the 2026 Char Dham Yatra gathers momentum, a controversy has erupted at the sacred Kedarnath...
By Dunna Jessicaruth 2026-05-14 09:06:39 0 191
Telangana
కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం
కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్...
By Vangari Praveen 2026-05-01 10:18:07 0 737
Andhra Pradesh
అంబటి రాంబాబు ధర్మ పోరాటానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు
అంబటి రాంబాబు ధర్మపోరాటానికి వెలంపల్లి శ్రీనివాసరావు మద్దతు: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో...
By Rajini Kumari 2026-04-18 17:30:47 0 165
Andhra Pradesh
మాల యాదవులను చంపిన చర్యలు వ్యతిరేకిస్తున్న డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
ప్రెస్ నోట్  మాల. యాదవులను చంపిన నీరుకొండలో టీడీపీ వ్యవస్థాపకులు. మాజీ సీఎం ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-01-20 11:12:23 0 212
Andhra Pradesh
పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-04-10 04:42:30 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com