గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు

0
229

కృష్ణాజిల్లా పోలీస్

 

*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,*

 

ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ వి .విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు ఏ.ఆర్ పోలీస్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులతో కలిసి వీక్షించారు.

 

 🔹పెరేడ్ కమాండర్ గా అడ్మిన్ ఆర్.ఐ రాఘవయ్య గారు వ్యవహరించారు. ముందుగా ఎస్పీ గారు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. తరువాత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల పరేడ్ ను స్వయంగా పరిశీలించారు.

 

*ఈ సంధర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..*

 

 🔹సివిల్, ఏ‌ఆర్, హోంగార్డ్సు, విద్యార్థుల ప్లటూన్స్ అందరూ చాలా చక్కటి టర్నవుట్ తో పరేడ్ రిహార్సల్స్ బాగా చేశారని పెరెడ్ పై సంతృప్తి వ్యక్తపరిచారు, పెరెడ్ లో పాల్గొంటున్న సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలనతో రిహాసల్స్ లో పాల్గొనాలని, ఈ వేడుకలు గర్వకారణంగా నిలిచేలా ప్రతి అంశాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. 

 

 🔹ఇదే స్పూర్తితో రేపు కూడా రెట్టింపు ఉత్సాహంతో పెరేడ్ చేయాలని సూచించారు.

 

🔹గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లతో భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

🔹ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, ఏ ఆర్ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ గారు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Chennaiah Kati 2026-06-20 08:37:58 0 131
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 288
Tamilnadu
Clean Tamil Nadu Mission Boosts Waste Management Efforts
Tamil Nadu is strengthening its waste management framework through the Clean Tamil Nadu Mission,...
By Fathima Safa 2026-06-29 10:05:54 0 238
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 168
Andhra Pradesh
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.
    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్...
By Pagadala Venkateswar 2026-05-15 06:19:25 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com