వ్యాపారులకు ఆర్థిక భరోసా రుణాలు అందజేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
221

కర్నూలు : నంద్యాల : డోన్ 

డోన్ పట్టణంలో PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా – 270 మందికి రూ.45.30 లక్షల రుణాలు మంజూరు

డోన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్లబ్ హౌస్‌లో ఈ రోజు డోన్ మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో అమలవుతున్న PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి అందుతున్న సహాయంపై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద డోన్ పట్టణంలో మొత్తం 270 మంది వీధి వ్యాపారులకు రూ.45,30,000/- (అక్షరాలా రూపాయలు నలభై ఐదు లక్షల ముప్పై వేల మాత్రమే) రుణాలు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి* గారు మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు మరియు వీధి వ్యాపారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM–SVANidhi 2.0 పథకాన్ని ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం లభించి, వ్యాపారుల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

డోన్ పట్టణంలో అర్హులైన మరింత మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మరియు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడంలో మున్సిపల్ శాఖ, మెప్మ సిబ్బంది ప్రజల పక్షాన నిలబడి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపారుల చేతికి క్రెడిట్ కార్డులు అందించగా, పథకం ద్వారా మంజూరైన రుణాల విలువను ప్రతిబింబించే మెగా చెక్‌ను ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు వీధి వ్యాపారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల...
By Mitappaly Shiavji 2026-01-09 07:23:53 0 473
Andhra Pradesh
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెమర్తి జగన్మోహన రాజు
    నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని...
By Benguluri Madhubabu 2026-07-15 03:16:55 1 168
Telangana
పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:37:48 0 124
Andhra Pradesh
విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త...
By Gadiyapudi Narendra 2026-03-02 17:26:46 0 228
Andhra Pradesh
Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.
వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక   ఇకపై అంబటికి అసలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:50:22 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com