Good reporting should have the same standard as in a courtroom - beyond a reasonable doubt.
## Shivaj Mittapally
  • 18 Posts
  • 1 Photos
  • 0 Videos
  • LAB TECHNICIAN ## SIRI PATH LAB'S OWNER at DASTURABAD
  • Studied Yes at SLATE
  • Followed by 2 people
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • దుస్తూరాబాద్: ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం'
    జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని దుస్తూరాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు శుక్రవారం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.
    0 Comments 0 Shares 439 Views 0 Reviews
  • దస్తూరాబాద్: సమస్యలపై ప్రత్యేక దృష్టి
    గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాట్లు గొడిసెర్యాల గోండు గూడెం (జీ) సర్పంచ్ మెస్రం సురేందర్ అన్నారు. మండలంలోని గొడిసెర్యాల గోండు గూడెం (జీ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమస్యలపై, అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానం చేశారు. ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి గంగాదేవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 484 Views 0 Reviews
  • దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
    దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 466 Views 0 Reviews
  • రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
    తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు మొదలవ్వనున్నాయి. ఏపీలో ఈ నెల 18 వరకు కొనసాగుతాయి. 19న(సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న (శనివారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. పిల్లలకు హాలిడేస్ నేపథ్యంలో పేరెంట్స్ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారనున్నాయి.
    0 Comments 0 Shares 482 Views 0 Reviews
  • దస్తూరాబాద్: ‘సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం'
    సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తాం అని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేశ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యా యుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన క్యాలెండర్ను ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఆ శాఖ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
    0 Comments 0 Shares 472 Views 0 Reviews
  • MNCL: పదో తరగతి విద్యార్థులకు ALERT
    పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 500 Views 0 Reviews
  • దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన
    దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ లెవల్ అధికారులతో (బీఎల్డీ) సమావేశమై, 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆసిఫ్, ఆపరేటర్ వెంకటేష్, బీఎల్ఎలు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 482 Views 0 Reviews
  • ఈ నెల 10 నుంచి టీసీసీ ఎగ్జామ్స్
    TG: రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్షలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. జిల్లా, ట్రేడ్ కోడ్, పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
    0 Comments 0 Shares 496 Views 0 Reviews
  • మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
    ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేసింది. ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని, భక్తులు గమనించాలని TID కోరింది.
    0 Comments 0 Shares 511 Views 0 Reviews
  • గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడు
    TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్కు తరలించింది.
    0 Comments 0 Shares 594 Views 0 Reviews
  • దస్తూరాబాద్: ‘ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'
    దస్తూరాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలి చిత్రపటానికి అధికారులు, ఉపాధ్యా యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యా వికాసానికి ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి తరం విద్యార్థులు ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో హెచ్ఎంలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 490 Views 0 Reviews
  • ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
    రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. బాధ్యురాలైన వైద్యురాలిపై చర్యలకు డీఎంఈకి సిఫారసు చేయగా.. ముగ్గురు స్టాఫ్ నర్సుల డిప్యుటేషన్ రద్దు చేశారు. ఒక ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించగా, ఇద్దరు ఆయాలను ఓపీకి మార్చారు. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
    Like
    1
    0 Comments 0 Shares 600 Views 0 Reviews
  • దస్తూరాబాద్లో యూరియా కొరత లేదు: ఏవో
    దస్తూరాబాద్ మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారిణి మానస అన్నారు.   మున్యాల గ్రామంలోని ఆగ్రో ఎరువుల దుకాణాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, ఎరువులను, విత్తనాలను పరిశీలించారు. ఎరువులను, విత్తనాలను కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. నాణ్య మైన విత్తనాలను రైతులకు అమ్మాలన్నారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.
    0 Comments 0 Shares 525 Views 0 Reviews
  • అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు
    దస్తురాబాద్, డిసెంబర్ 28 మారు మూల గ్రామాలకు మెరుగైన రోడు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన లింక్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు నిధుల లేమితో మధ్యలోనే నిలిచిపోయాయి. భూత్కూర్ నుంచి పెర్కపల్లె గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన శాఖ ద్వారా రూ.1.11కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మట్టి చదను చేసి, మొరం పోసి,...
    0 Comments 0 Shares 531 Views 0 Reviews
  • దస్తూరాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
    దస్తూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 28న ఏఓ హ్యూమ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భవించిన తీరును నాయకులు గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర అద్వితీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 524 Views 0 Reviews
  • మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
    కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్ గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు. # shivaji
    0 Comments 0 Shares 578 Views 0 Reviews
  • త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ పనులు ;కేంద్ర మంత్రి
    ఆదిలాబాద్లో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరలోనే పట్టాలెక్కిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిర్పోర్టు మైదానాన్ని సందర్శించి, విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియ, రన్వే మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. # shivaji
    0 Comments 0 Shares 551 Views 0 Reviews
  • Warm Welcome to Mitappaly shivaji !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    #Shivaji
    Warm Welcome to Mitappaly shivaji ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz #Shivaji
    0 Comments 0 Shares 544 Views 1 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com