పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

0
202

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందించిన. మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు స్వయంగా మంత్రి గారిని కలిసి రైతుల బాధలను వారి దృష్టికి తీసుకెళ్లారు.కెరమేరి మండలం సుర్దాపూర్, జైనూర్ మండలం పొలస, సిర్పూర్ (యు) మండలం మరియు లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామాల పరిధిలోని పోడు రైతులు అనేక సంవత్సరాలుగా ఆ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములే వారి కుటుంబాలకు ఏకైక జీవనాధారమని వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు స్పందిస్తు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ గారు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు ముసాదే చరణ్ గారు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో...
By Pagadala Venkateswar 2026-06-10 05:19:15 0 109
Telangana
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
By Sidhu Maroju 2026-01-02 15:15:05 0 229
Telangana
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్...
By Sidhu Maroju 2026-05-11 09:34:35 0 499
Telangana
KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్
KTR
By Sunka Santhosh 2026-03-23 19:41:57 0 316
Telangana
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కుతుబుల్లాపూర్, బచుపల్లి, ,మల్లంపేట్ ,దుండిగల్, సూరారం, బౌరంపేట్ ,గాగిల్లాపూర్ లో, ఘనంగా...
By Ponnala Srinivasrao 2026-03-27 07:08:33 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com