పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం

0
228

*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*

 

*పోలవరం, జనవరి 20:* 

 

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
లక్డీకాపూల్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, లక్డీకాపూల్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి...
By Lakavath Kiran 2026-07-26 16:02:16 0 373
Puducherry
Puducherry's Bold New Vision: Infrastructure & Tourism Boost
The Government of Puducherry has unveiled a transformative fiscal roadmap, placing a strategic...
By Lokeshwari Panthadi 2026-06-30 10:32:32 0 107
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 825
Telangana
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే...
By Sidhu Maroju 2025-06-29 15:07:24 0 1K
Andhra Pradesh
అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-06-01 04:31:51 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com