సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్

0
660

Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. ఈ ఓటమికి రోహిత్, జడేజా వంటి ఆటగాళ్ళు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ, మరో ఆటగాడి హాస్తం కూడా ఉంది.

 

Team India T20I World Cup 2026 Squad: భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించినప్పుడు, వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాకు ఎలాంటి సవాలు ఎదురుకాదని, కివీస్ క్లీన్ స్వీప్ సాధిస్తుందని అందరూ భావించారు. అయితే, భారతదేశంలో తొలిసారిగా వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా న్యూజిలాండ్ అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. టీమిండియా ఓటమిలో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన కీలకంగా మారింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలను అందరూ లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, భారత జట్టుకు అతిపెద్ద నష్టం స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైఫల్యం. దీంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026లోనూ ఈ ప్లేయర్ వల్ల భారత జట్టుకు ఇబ్బంది కలగవచ్చు.

 

తొలి మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు సిరీస్‌ను ప్రారంభించింది. కానీ, తరువాతి రెండు మ్యాచ్‌ల్లో కివీస్ భారత జట్టును ఓడించింది. రెండు మ్యాచ్‌లలో భారత బ్యాటింగ్ విమర్శలకు గురైనప్పటికీ, బౌలింగ్ కూడా దారుణంగా ఉంది. రెండో వన్డేలో, న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 285 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు.

 

#Sivanagendra

#T20Worldcup

Search
Categories
Read More
Telangana
సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్  (25) సం" మృతి చెందిన ఘటన...
By Sunka Santhosh 2026-06-12 06:10:10 0 113
Andhra Pradesh
నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు.
  నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు Andhra...
By Pagadala Venkateswar 2026-05-25 04:44:04 0 115
Telangana
పేద కుటుంబనికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ కు చెందిన లక్ష్మికి...
By Avunoori Mahesh 2026-04-29 11:10:32 0 214
Andhra Pradesh
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...
By Pagadala Venkateswar 2026-01-29 07:47:27 0 188
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com