Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.

0
222

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి

 

23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ

రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన వైనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.

 

ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

Search
Categories
Read More
Telangana
పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
    హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు...
By Sidhu Maroju 2026-03-25 06:08:32 0 214
Andhra Pradesh
నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు  ...
By Rajini Kumari 2025-12-16 07:51:12 0 220
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు...
By Pagadala Venkateswar 2026-05-04 05:50:16 0 120
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 1K
Telangana
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-16 01:39:13 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com