డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|

0
170

"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్"

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. 

డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన నేపథ్యంలో షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఈటల రాజేందర్, నిరసనకారులను పరామర్శించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో జవహర్‌నగర్‌లో స్థానిక ప్రాంతాల చెత్త మాత్రమే డంప్ చేసేవారని, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారీ స్థాయిలో చెత్తను ఒకే ప్రాంతంలో వేయడం వల్ల జవహర్‌నగర్, బాలాజీనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలు తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, లీచేట్ వాటర్ శుద్ధి వంటి చర్యలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, దీంతో పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. గతంలో ఈ సమస్యపై పోరాడిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, అరెస్టులు, కేసులు సమస్యకు పరిష్కారం కావని ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని చెత్తను ఒకే ప్రాంతంలో వేయకుండా వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించి, జీరో పొల్యూషన్ లక్ష్యంతో ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు.
30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న...
By Pagadala Venkateswar 2026-06-24 04:30:35 0 101
Manipur
Manipur Advances Digital Governance and Public Services
Manipur continues to strengthen its digital governance ecosystem by expanding online public...
By Fathima Safa 2026-07-03 16:11:11 0 87
Telangana
కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న...
By Thalakokkula Sadanandam 2026-06-11 17:48:25 0 388
Telangana
నిజామాబాద్
ఈరోజు డివిజన్లో పర్యటించి SIR ఎనిమరేషన్ ఫామ్లను అధికారులతో కలిసి అందించడం జరిగింది.దాంపల్లి...
By Sadaq Sadaq 2026-06-29 18:26:49 0 174
Telangana
Cm revanth reddy at ruthu ashirwad sabha
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్...
By G k Nookala 2026-07-10 10:20:32 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com