యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|

0
262

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్ గద్దర్ కాలనీలో రంగోలి( ముగ్గుల) పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాలనీలోని  200 వందల కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొని, తమ ఇంటి ముంగిట ముగ్గులతో కళాత్మకతను చాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని, ఇలాంటి సామూహిక వేడుకలు, ఐక్యతను పెంచుతాయని కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని కలవడం నాకు అత్యంత ఆనందకరమని తెలియజేశారు. 

ఈ ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలైన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

 ప్రధమ బహుమతి : కవిత. రూ.3000/-

ద్వితీయ బహుమతి : మాధవి రూ. 2000/

తృతీయ బహుమతి :పుట్టపాక చిట్టెమ్మ.రూ 1000/-

విజేతలకు ఆయన నగదు పురస్కారం అందజేశారు.

పండుగ కానుకగా కాలనీ లోని ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో... డివిజన్ అధ్యక్షులు, గోరించి సిద్ధారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య, కాలనీ చైర్మన్ స్వామి, ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు నాయక్, సెక్రటరీ చిన్నబాబు,  తదితర బిజెపి నాయకులు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
Haryana
Field to Fortune: New Agriculture Subsidies Take Root
As of May 15, the Department of Agriculture is actively rolling out the 2026-27 Annual Action...
By Dunna Jessicaruth 2026-05-15 06:35:02 0 163
Andhra Pradesh
రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణే లక్ష్యం – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యనమదలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
చేజర్ల: రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర...
By Ratna Sekhar 2026-03-10 19:51:51 0 1K
Andhra Pradesh
వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను...
By Pagadala Venkateswar 2026-03-24 03:38:58 0 201
Andhra Pradesh
చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు...
By Vadlamudi NagaVenkat 2026-03-31 09:32:16 0 479
Andhra Pradesh
మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్
కృష్ణాజిల్లా   మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం   ...
By Rajini Kumari 2026-02-28 12:49:35 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com