GST RTGS ప పట్టాదారు పాసుపుస్తకాలపై మంత్రులు అధికారులతో సమీక్ష సీఎం చంద్రబాబు

0
292

 

 

*అమరావతి*

 

*జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో సమీక్షలో దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

• గిన్నీస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినేవాళ్లం ఇప్పుడు భారత్‌లో, అందులో ఏపీలోనూ నమోదు అవుతున్నాయి

• ఇది సమిష్టి విజయంగా భావిస్తున్నాను. వేగంగా రహదారుల నిర్మాణం దేశ ప్రగతికి కీలకంగా మారుతుంది

• ఏ పనులూ రాత్రికి రాత్రి పూర్తి కావు. అన్ని వ్యవస్థలూ ఇంటిగ్రేట్ కావాలి

• జాతీయ రహదారుల నిర్మాణంలో నితిన్ గడ్కరీ రికార్డులు సృష్టిస్తున్నారు

• అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. 

• జీఎస్డీపీ, శాంతి భద్రతలు ఇలా అన్ని రంగాల్లోనూ పనితీరు బేరీజు వేస్తున్నాం

• గత ఏడాది ఏపీ కంటే బాగా చేసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వాటితో పోటీగా మనం ముందుకు వెళ్లాలి

• నీటి భద్రత సాధించాం. సీజన్ల వారీగా నీటి పంపిణీ జరగాలి. ఇదే తరహాలో ఇతర విభాగాలు కూడా పనిచేయాలి

• ఏ అంశంలో అయినా ప్రభుత్వ శాఖలు ముందస్తుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి

• నెలలవారీ, త్రైమాసికంగా, సంవత్సర ప్రణాళికలు ఉంటేనే లక్ష్యాలను సాధించగలుగుతాం

• ప్రతీ ప్రభుత్వ శాఖ, జిల్లా కూడా ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయానికి నిర్దేశిత వృద్ధిరేటును సాధించగలగాలి

• యాక్యురెసీ ఆఫ్ డేటాపై కలెక్టర్లు, అధికారులు దృష్టి పెట్టాలి. ఆ సమాచారం ఆధారంగానే జీఎస్డీపీ నేరుగా నమోదు కావాలి

• వచ్చే నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించి జీఎస్డీపీ అంశాలను మరోమారు పరిశీలిస్తాం

• పది సూత్రాల అమలు పర్యవేక్షణకు పది మంది అధికారులను టాస్క్ ఫోర్సుగా ఏర్పాటు చేశాం

• క్షేత్రస్థాయిలో వీటిని సరిగ్గా అమలు చేసేందుకు బాధ్యత తీసుకోవాలి

• కొన్ని ప్రభుత్వ శాఖలు కేంద్ర నిధుల్ని ఖర్చు చేయటం లేదు. వీటిపై దృష్టి పెట్టండి

• జనవరి 15 లోగా ఖర్చు చేసి యుటిలిటీ సర్ఠిఫికెట్లు సమర్పించండి. 

• ఈ నెలాఖరు లోగా వందశాతం నిధులు వ్యయం చేయాల్సిందే. 

• మార్చి 15 నాటికల్లా కేంద్ర నిధులు ఖర్చు చేసేసి అదనపు నిధులకు వెళ్లండి

• *డూ ఆర్ డై విధానంలో కేంద్ర నిధుల్ని ఖర్చు చేయాలి*

• జనవరి నెలాఖరు లోగా ఖర్చు పెట్టి మార్చి 15 తర్వాత అదనపు నిధుల కోసం కేంద్రం దగ్గరకు వెళ్దాం

• ఖర్చు చేయకపోతే అది ఆయా విభాగాల వైఫల్యం కిందకే వస్తుంది

• రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి లో ప్రత్యేక సెల్ ఆర్ధిక శాఖలో ఏర్పాటు చేసుకున్నాం

• నిధులు లేవనే కారణంతో ప్రాజెక్టులను నిలిపేయకుండా వాటిని చెపట్టేలా క్రియేటివ్ విధానంలో ఆలోచన చేయండి

• పీపీపీ ద్వారా వేర్వేరు వినూత్న ప్రాజెక్టులు చేపట్టండి

• స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు ఆస్కారం ఉంది

• స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎందుకు నిధులు వ్యయం చేయలేదు. అర్బన్ రూరల్ 440 కోట్లు ఉంటే అంత తక్కువ వ్యయం చేయటం ఏమిటి

• అదనపు నిధులు కూడా కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. 

• తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైబ్రీడ్ మోడల్ లో రహదారులు వేసే అంశంపై ప్రణాళికలు చేయండి

• మంజూరు అయిన ప్రాజెక్టులన్నిటికీ పనులు వేగంగా ప్రారంభం కావాలి

• జిల్లా కలెక్టర్లు అన్ని మేజర్ పారిశ్రామిక ప్రాజెక్టులూ గ్రౌండింగ్ అయ్యేట్టు శ్రద్ధ వహించాలి.

• ప్రతీ ప్రభుత్వ శాఖా పౌరసేవలు అందించటంలో మరింత మెరుగ్గా వ్యవహరించాలి. 

• ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. దానిపై అధికారులు శ్రద్ధ పెట్టాలి.

Search
Categories
Read More
SURAKSHA
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
 భవిష్యత్ తరాలైన విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీసులు...
By Kalaga Sailaja 2026-06-30 09:02:06 0 132
Andhra Pradesh
విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ డే’ వేడుకలు
చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం...
By Vadlamudi NagaVenkat 2026-03-14 02:41:39 0 689
Telangana
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం...
By Ponnala Srinivasrao 2026-05-27 04:15:49 0 137
Andhra Pradesh
అక్రమాలకు నిలయంగా మారిన నల్లచెరువు
*అక్రమాలకు నిలయంగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ*   *-దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నా...
By Rajini Kumari 2026-03-06 10:53:25 0 224
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:03:51 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com