అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి

0
71

సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో  తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
West Bengal
West Bengal, Centre Agree on Border Security Truce |
After unrest in Nepal, West Bengal and the Centre have agreed on a security “truce”...
By Pooja Patil 2025-09-16 04:55:02 0 54
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 2K
Andhra Pradesh
ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ
కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో రేషన్ కార్డుదారులకు కొడుమూరు నియోజవర్గ ఎంఎల్ఏ బొగ్గుల...
By mahaboob basha 2025-09-30 10:45:16 0 95
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 77
Telangana
సెప్టెంబరులో 18 లక్షల వాహనాల అమ్మకాలు సంచలనం |
హైదరాబాద్ జిల్లా:సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం...
By Bhuvaneswari Shanaga 2025-10-07 07:36:38 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com