కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు

0
205

*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*

 

*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు*

 

*సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలి*

 

*సంక్రాంతి వేళ ప్రత్యేక నిఘా – మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్*

 

సంక్రాంతి పండుగను శాంతియుతంగా, సుఖసంతోషాలతో జరుపుకోవాలని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం సూచనలతో పండుగ సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.సంక్రాంతి రోజుల్లో కోడి పందాలు, జూదం, గుండాట వంటి నిషేధిత ఆటలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు మండల పరిధి అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.నిర్మానుష ప్రాంతాలు, పొలాలు, గ్రామ శివార్లలో నిషేధిత ఆటలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యువత కోడి పందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇవి కుటుంబాలు, సమాజాన్ని నష్టపరిచే ప్రమాదం ఉందని తెలిపారు.అదేవిధంగా మద్యం సేవించి అల్లరి సృష్టించే అసాంఘిక శక్తులపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారు తమ వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌కు ముందుగానే తెలియజేయాలని సూచించారు. ఇది భద్రతా పరంగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు లేదా నిషేధిత ఆటలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే పండుగను ప్రశాంతంగా నిర్వహించవచ్చని, పోలీస్ శాఖ ప్రజల భద్రతకే ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-02-14 12:47:08 0 193
Andhra Pradesh
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
  ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా...
By BABJI DADALA 2026-01-12 14:50:58 0 726
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 200
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-03-16 05:45:21 0 272
Telangana
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|
● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం...
By Sidhu Maroju 2026-07-23 10:26:51 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com