కబడ్డీ పోటీల నిర్వహణ:

0
194


క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ABM చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ప్రాంగణం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు గారితో కలిసి కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు స్వయంగా కబడ్డీ పోటీలో పాల్గొని యువతతో కలసి ఆటలో భాగమయ్యారు. ప్రజాప్రతినిధులు అయినటువంటి ముఖ్యంగా ఎంపీ నాగరాజు గారు పంచలింగాల వాస్తవ్యుడు కావడం MLA శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఆ గ్రామానికి అల్లుడవడం వీరిరువురు మైదానంలోకి దిగడం పట్ల యువతలో అపూర్వమైన ఉత్సాహాన్ని కలిగించి, క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచింది. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.యువత క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చర్చ్ నిర్వాహకులు, క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చర్చ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
By Sidhu Maroju 2025-12-17 14:52:09 0 240
Andhra Pradesh
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..          ...
By Rajini Kumari 2025-12-31 11:00:43 0 237
Andhra Pradesh
కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-05 03:25:00 0 358
Business & Finance
Think Collateral-Free Loans Are Too Good to Be True ?
Collateral-free loans allow eligible individuals, startups, and MSMEs to access financing without...
By Navya Sree 2026-07-09 06:35:52 0 75
Andhra Pradesh
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో...
By Kothuru Murali 2026-04-03 09:50:59 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com