గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా రాజా కుళ్లాయప్ప బాధ్యతల స్వీకరణ

0
490

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తక్షణమే తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే, ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అదేవిధంగా, ప్రజలకు ఎలాంటి సమస్యలు, అన్యాయాలు జరిగినా, లేదా పోలీస్ సహాయం అవసరమైన సందర్భాలలో నేరుగా గూడూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, ప్రజల హక్కుల పరిరక్షణకు మరియు న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. రాజా కుళ్లాయప్ప , తన శిక్షణ పూర్తి చేసిన అనంతరం చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో పి.ఎస్‌.ఐగా విధులు నిర్వహించారు. అనంతరం పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై గూడూరు పోలీస్ స్టేషన్‌కు ఎస్‌.హెచ్‌.ఓగా నియమితులై, అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ప్రజల సహకారంతో గూడూరు పట్టణంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపరచడం, నేరరహిత వాతావరణాన్ని నెలకొల్పడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖతో సమన్వయం కలిగి పనిచేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్ప
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాలు, డిఎస్పి మహేంద్ర సూచనల మేరకు సంక్రాంతి పండుగ...
By Kothuru Murali 2026-01-13 09:25:56 0 149
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:31:31 0 136
Andhra Pradesh
రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 24, 2026*  ...
By Rajini Kumari 2026-04-24 13:04:44 0 124
Telangana
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే౹*   *సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే॥*  ...
By Ponnala Srinivasrao 2026-03-27 03:19:15 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com