మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
272

*గుంటూరు*

 

*3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

 

*3వ ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ...*

 

• సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషం.

• మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలు.

• తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.

• వందలాది భాషలు ఉన్నా... కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది.. అందులో తెలుగు ఉండడం గర్వకారణం.

• ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు... ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయం.

• కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరధి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారు... తెలుగు వైభవం చాటారు.

• వేమన, సుమతీ, భాస్కర పద్యాలు మరిచిపోలేం.

• పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం పెంచేలా చేయాలి... తెలుగు భాష ఎక్కడికీ పోదు... శాశ్వతంగా ఉంటుంది.

• అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారు.

• విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి.

• తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేం.

• నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావు.

• తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్.

• తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టిశ్రీరాములను మరువలేం.

• రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు... పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూ గుర్తుంటారు.

• ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదు.

• తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి.

• దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మన తెలుగువాడే.

• మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకం.

• అందుకే దేశ భాషలందు తెలుసు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు తెలుగు భాషను కీర్తించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 201
Telangana
ఆకలా వర్షం ఉరుముల మెరుపులతో రాళ్ళ వర్షం
తలకొండపల్లి మండలంలోని చౌదరపల్లి గ్రామంలో అకాల వర్షం కురిసింది ఉరుముల మెరుపులు రాళ్లు తో కూడిన...
By MERIGE MALLESH 2026-04-21 11:34:41 0 719
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో ఈనెల 14న ఎమ్మెల్యే ఎంపీల ఇఫ్తార్ విందు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు...
By Kothuru Murali 2026-03-08 08:21:30 0 203
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 120
SURAKSHA
TN Police Today: Guardians Of Road Safety Now
Today TN traffic police focused on saving lives on roads. School zones in Chennai, Salem,...
By Kalaga Sailaja 2026-07-04 08:02:37 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com