పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే

0
253

*Press Release*

 

*పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*

 

*ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది... ప్రభుత్వమే నిర్దేశిస్తుంది*

 

*పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే... ప్రైవేట్ రోడ్లు అవుతాయా?*

 

*విమర్శలు చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం*

 

*5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు*

 

*అమరావతి, డిసెంబర్ 17 :* పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా... అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంపెద్ద దోర్నాల. అక్రమ అరెస్టులను ఖండించండి.అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలి,* *- సిఐటియు డిమాండ్...*
మార్కాపురం జిల్లా దోర్నాల మండల                 ...
By Chennaiah Kati 2026-03-03 13:03:48 0 265
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
By Pagadala Venkateswar 2026-03-03 11:21:44 0 188
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
Telangana
నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ...
By Avunoori Mahesh 2026-05-02 11:24:33 0 270
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 305
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com