చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి

0
192

*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*

 

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న నారా బ్రాహ్మణి

 

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థే తన తొలి ప్రాధాన్యమని వెల్లడి

 

లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం వదులుకోలేనన్న లోకేశ్ భార్య

 

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు.

 

బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (MPW) 2025' కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు.

 

"పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి వివరించారు. ఈ వ్యాఖ్యలతో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 348
Telangana
ఆసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం ఎస్సై హనుమా నాయక్
చిలుకూరు 06.05.26 (భారత్ ఆవాజ్ న్యూస్) అక్రమ కార్యక్రమాలపై 100కు సమాచారం ఇవ్వండి, నేరాల నివారణలో...
By Nookapangu Manikanta 2026-05-06 14:51:36 0 144
Andhra Pradesh
ఒంగోలులో కొత్తగా ప్రారంభమైన Samsung Experience Store (Vasisht retail) 13 వ బ్రాంచ్
ఒంగోలు నగరవాసులకు శుభవార్త! అత్యాధునిక టెక్నాలజీని మరింత దగ్గర చేస్తూ, Samsung...
By SivaNagendra Annapareddy 2025-12-12 10:44:32 0 488
SURAKSHA
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...
By Lokeshwari Panthadi 2026-07-25 05:47:00 0 127
Telangana
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)   చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:00:17 0 372
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com