చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి

0
13

*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*

 

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న నారా బ్రాహ్మణి

 

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థే తన తొలి ప్రాధాన్యమని వెల్లడి

 

లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం వదులుకోలేనన్న లోకేశ్ భార్య

 

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు.

 

బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (MPW) 2025' కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు.

 

"పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి వివరించారు. ఈ వ్యాఖ్యలతో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు.

Search
Categories
Read More
Telangana
నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి టు బిహెచ్కె పత్రిక సోదరులు
ఈరోజు 2 BHK ప్రెస్ క్లబ్ మిత్రులము అందరం కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మైగూడ మున్సిపల్...
By Vadla Egonda 2025-06-27 15:25:18 0 1K
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 118
Telangana
తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్...
By Sidhu Maroju 2025-06-30 17:32:37 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com