ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక

0
581

చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.
ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట చేరుతారు. పండగ అనంతరం కూడా కలిసి గడపాలనే ఉద్దేశంతో సముద్రతీరాలకు వెళ్లి ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ప్రత్యేకంగా చీరాల ప్రాంతంలోని సముద్ర తీరాలు అయిన రామాపురం,ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని సహజ సౌందర్యం, చల్లని గాలి సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పర్చూరు తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చీరాల సముద్రతీరానికి తరలివచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి వెళ్తారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
సముద్ర గర్భం కుచించిపోతోంది నానాటికి మన అడవులు అంతరించిపోతున్నాయి
సముద్ర గర్భం కుచించుకుపోతుంది.. నానాటికి మడ అడవులు అంతరించిపోతున్నాయి.. సుప్రీంకోర్టు...
By Rajini Kumari 2026-05-29 11:19:56 0 114
Madhya Pradesh
MP High Court Sets Strict Timeline for Public Event Permits
In a significant ruling concerning the Indore Muharram procession, the Madhya Pradesh High Court...
By Lokeshwari Panthadi 2026-06-27 08:12:15 0 77
Andhra Pradesh
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
By Thokala Sivaji 2026-03-28 06:10:03 0 747
SURAKSHA
Nalin Prabhat, IPS: A Symbol of Courage and Leadership
India's Decorated Police Leader Strengthening Security, Counter-Terrorism, and Public Safety in...
By Lokeshwari Panthadi 2026-07-17 09:26:16 0 268
Telangana
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు
 తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్...
By Avunoori Mahesh 2026-05-12 17:11:15 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com