ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము

0
58

*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఇంధన పొదుపు వారోత్సవాల... పోస్టర్లు, ప్రచార పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

 

గుడివాడ డిసెంబర్ 15:ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా ఇవ్వాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. 

 

ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్, ప్రచార పత్రికలను రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం ఇంధన పొదుపుపై ప్రజ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలతో విద్యుత్ ఆదా చేయడం వల్ల పర్యావరణ హితమై కాకుండా... డబ్బు కూడా ఆదా అవుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు.

 

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ D.E జిబి శ్రీనివాసరావు, ఏడీలు బాపిరాజు, కిరణ్ బాబు, ఏఈలు బ్రహ్మానందరావు ఉష, సూర్యప్రకాశరావు, శ్రీహరి ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Goa
गोवा विद्यापीठ-INCOIS MoU समुद्र संशोधनात वादस्पद सहकार्य
गोवा विद्यापीठ आनी #INCOIS यांच्यात आपत्ती व्यवस्थापन आनी #समुद्रसंशोधन क्षेत्रात सहकार्य...
By Pooja Patil 2025-09-13 09:26:48 0 74
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 100
Telangana
ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్...
By Sidhu Maroju 2025-10-30 14:13:48 0 57
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com