బోనాల పండుగ పంపిణీలో చెక్కుల వివాదం- కాలనీవాసులపై అయినా కేసులను పున పరిశీలించండి; ఎమ్మెల్యే.|

0
38

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి IPS ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ-

2025 జూలై 15న అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం,కౌకూర్ ఫార్చ్యూన్ ఎంక్లేవ్ కాలనీ వాసులపై నమోదైన కేసు పునఃపరిశీలన శాంతి భద్రతా చర్యల పురోగతి,

అంశాలను డిజిపి తో వివరంగా చర్చించారు.

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజలపై అనవసరమైన కేసులు నమోదు చేయకుండా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పోలీసు డిజిపి బి. శివధర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మేకల రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 2K
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాలు
కర్నూలు : కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో రాత్రి బస...
By krishna Reddy 2025-12-14 06:24:53 1 208
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com